Ramadasu Keertanas

Harihararama Nannuramara Lyrics in Telugu | Ramadasu Keerthana

Harihararama Nannuramara Telugu Lyrics :

పల్లవి:
హరిహరిరామ నన్నరమర చూడకు
నిరతము నీ నామస్మరణ ఏమరను హ ॥

చరణము(లు):
దశరథనందన దశముఖమర్దన
పశుపతిరంజన పాపవిమోచన హ ॥

మణిమయభూషణ మంజులభాషణ
రణజయభీషణ రఘుకులపోషణ హ ॥

పతితపావననామ భద్రాచలధామ
సతతము శ్రీరామదాసునేలుమా రామ హ ॥

 

Add Comment

Click here to post a comment