Best Spiritual Website

Spiritual, Stotrams, Mantras PDFs

Swamy Nannu Raksimpavemi Lyrics in Telugu | Ramadasu Keerthana

Swami Nannu Raksimpavemi Telugu Lyrics:

పల్లవి:
స్వామీ నన్ను రక్షింపవేమి సీతారామా
స్వామీ నన్ను రక్షింపవేమి స్వా ॥

చరణము(లు):
మరువక నిన్నే నమ్మి యుంటి నీ దివ్యనామ
స్మరణమెప్పుడు చేయుచుంటి సత్కృపనిక
వరములిచ్చువాడని యుంటి ఎందునైన మీ
సరివేల్పు లేదని మరిమరి చాటుచుంటి స్వా ॥

రాతి నాతిగ జేసినావు అజామీళు
నిర్హేతుకంబుగ బ్రోచినావు ప్రహ్లాదుని
ప్రఖ్యాతి రక్షించినావు ద్రౌపదికి దయచేత చీరలొసగినావు
నామీద నేమి హేతువోగాని దయసుంతైన రానియ్యవు స్వా ॥

లీలా విభూతి జన్మమున నెత్తుచుండెడి మేలు నీపాటి నాకు
చాలు ఎంతని బ్రతిమాలుకొందు నను నీపాలు జేయుట
పదివేల భాగ్యములు దోషాల చూడక నను
నేలుకొంటె నాకు మేలు సంతోషముతోను స్వా ॥

సకలలోకములు నీలోను లోకముల బాయక నీవు
సంతోషముతో నున్నాడవనుచు ప్రకటించె
శ్రుతులు పాడగాను కర్ణముల మోదముతోడనే విన్నాను
ఇట్టివాడను ఇక నీవు ప్రోవకున్న నెవరు ప్రోచెదరు నన్ను స్వా ॥

దాసమానసపద్మభృంగా సంతత సద్విలాస పక్షితురంగా
శ్రీసీతామనోల్లాస యింద్రనీల శుభాంగ శ్రీభద్రాచలవాసా
సకరుణాంతరంగా ఏవేళ రామదాస
ప్రసన్నమైన కరుణాసాగరా రామా స్వా ॥

Swamy Nannu Raksimpavemi Lyrics in Telugu | Ramadasu Keerthana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top