Templesinindiainfo

Best Spiritual Website

Basara Saraswati Temple History in Telugu | Sevas, Timings

Basara Saraswathi Temple Timings: 4:00 AM to 8:30 PM

పురాణగాధ:

కురుక్షేత్ర యుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కోరి తన కుమారుడైన శుకునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇకాడ కుటీరం నిర్మించి తపస్సు చేయడం ప్రారంభించాడు. వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతలమూర్తులు ప్రతిష్టించాడు. వ్యాసుడు ఇక్కడ చెప్పతగింత కాలము నివసించాడు కనుక అప్పటినుండి ఈ ఊరు వ్యాసపురి , వ్యాసర అనబడి, తరువాత ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వలన ‘బాసర’ గా నామాంతరాన్ని సంతసించుకున్నది. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ పసుపును ఒక్క రవ్వంత తినినా అత్యంత విజ్ఞానం, జ్ఞానము లభిస్తుందని ఘాడంగా విశ్వసిస్తారు. ఆది కవి వాల్మికి ఇక్కడ సరస్వతీ దేవిని ప్రతిష్టించి రామాయణం వ్రాసాడని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. ఈ గుడికి సమీపంలో వాల్మికి మహర్షి సమాధి మార్బుల్ శిల ఉన్నాయి. మంజీరా మరియు గోదావరి తీరాన అష్ట్రకూటుల చేత నిర్మించబడిన మూడు దేవాలయాలలో ఇది ఒకటని విశ్వసించబడుతుంది.ారవ శతాబ్ధంలో నందగిరి ప్రాంతాంలో నందేడుని రాజధానిగా చేసుకుని పరిపాలించిన బిజలుడు అను రాజు బాసరలోని ఈ ఆలయమును నిర్మించాడన్న కధనం ప్రచారంలో ఉన్నది.

ఆలయ విశేషాలు:

ఆలయం ప్రాంగణంలో ఉన్న జ్ఞానప్రసూనాంబ బాసర సరస్వతీ ఆలయం దేశంలోని ప్రఖ్యాత సరస్వతీ ఆలయాలలో ఒకటి. ఇక్కడ సరస్వతీ ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఉన్న త్రిదేవీ మూర్తులు వ్యాస ప్రతిష్టితం కనుక ఈ ప్రత్యేకత. అక్షరాభ్యాసానికి ప్రత్యేక ఋసుము ఉంటుంది. ప్రజలు బంధు మిత్రులతో వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసము చేస్తారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో అక్షరాభ్యాసం జరిపిస్తారు. ఆలయ ప్రాంగణంలోని జ్ఞాప్రసూనాంబ చేతిలో ఉన్న అఖంద జ్యోతికి నూనె వంచడానికి భక్తులు ఆసక్తి ప్రదర్శిస్తారు. నూనె ఇక్కడ ఖరీదుకు లభిస్తుంది. అమ్మవారికి సమర్పించిన చీరలు ఆసక్తి కల భక్తులు కొనుగోలు చేసి పొంద వచ్చు. వెలుపలి కౌంటర్ వద్ద భక్తులు ప్రసాదములు కొనుక్కునే వసతి కూడా ఉంది.

దేవాలయం:

సుమారు 200 సంవత్సరాల క్రితం విధ్వంస కాండకు పాల్పడుతున్న కొందరు దుండగులను తరిమివేసి మక్కాజీ పటేల్ అనే వ్యక్తి మరి కొందరి సహాయంతో ఆలయం పునర్నిర్మాణం చేయించాడు.

Basara Saraswati Temple Sevas:

Abhishekam
Special Kumkumarchana
Akshara Srikaram / Aksharabhyasam
Sri Sathyanarayana Swami Pooja
Special Akshara Srikaram
Nithya Chandi Homam
Upanayanam
Pallaki Seva ( Every Friday)
Special Darshanam (only one person)
Vyasa Guha Pravesham
Gnana Jyothi Deepam
Shashvatha Kumkumarchana (Early once)
Suvarna Pushparchana (only friday 8:00 AM to 10:00 AM)
Shashvitha Pooja Abhishekam (Early once)
Vahana Poojalu

Basara Temple Utsavams:

మహా శివరాత్రి, వసంత పంచమి, అక్షరాభ్యాసం, దేవీ నవరాత్రులు, వ్యాస పూర్ణిమ ఇక్కడ విశేషంగా జరుపబడే ఉత్సవాలు. ప్రధానంగా ప్రతి సంవత్సరం మూడు ఉత్సవాలు జరుగుతాయి.

నవరాత్రులు:

ఆశ్విని శుద్ధ పాఢ్యమి మొదలు నవమి వరకు జరుగుతాయి. ఉదయము, సాయంకాలము 64 ఉపచారములతో వైదిక విధానంలో అమ్మవారికి వైభవంగా పూజలు జరుగుతాయి. శ్రీదేవీ భాగవతము, దుర్గా సప్తశతి పారాయణాలు జరుగుతాయి. మహర్నవమి రోజున చండీ హోమము చేయబడుతుంది. విజయదశమి నాడు వైదిక మంత్రాలతో మహాభిషేకము, సుందరమైన అలంకారము, సాయంకాలము పల్లకీ సేవ, శమీపూజ జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భక్తులు, ఉపాసకులు తమ తమ అభిష్టానుసారం పూజలు చేసుకొంటారు. ఇంకా ధార్మిక చర్చలు, ఉపన్యాసములు, హరికధలు, పురాణ పఠనం నిర్వహిస్తారు. యాత్రికులకు నిరతాన్నదానం సమర్పిస్తారు.

శ్రీ పంచమి:

మాఘ శుద్ధ పంచమినాడు సరస్వతీ జన్మదినోత్సవం జరుపుకొంటారు. మహాభిషేకం తరువాత వివిధ పుష్పాలతో వాగ్దేవిని నయనానందకరంగా అలంకరిస్తారు. జగద్రక్షణకై, భక్త పోషణకై అవతరరించిన కామితార్ధ ప్రదాయినిగా బాసర జ్ఞాన సరస్వతి ఈనాడు విశేష పూజలందుకొంటుంది. వసంత పంచమికి 15 రోజుల ముందు నుండి ప్రారంభం అయ్యే ఈ ఉత్సవాలు వసంత పంచమికి మూడు రోజుల వరకు జరుగుతాయి. ఆ సమయంలో దేవికి ప్రత్యేక పూజలు ఆరాధనలు జరుపుతారు.

మహా శివరాత్రి:

మహా శివరాత్రి పర్వదినం మొదలుకొని మూడు రోజులు పెద్ద జాతర సాగుతుంది. వేలాది భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించి వాగ్దేవికి ప్రదక్షిణాలు ఆచరిస్తారు.

మాధుకరము:

ఈ వూరిలో ఇది ఒక ముఖ్యమైన సంప్రదాయం. మధుకర వృత్తి (యాచించుట) ద్వారా లభించే భిక్షకు మాధుకరము అని పేరు. శ్రీదేవి అనుగ్రహము కోరేవారు నియమ నిష్టలతో 11 లేదా 21 లేదా 41 రోజులు దీక్షతో గురూపదేశ మంత్రము అనుష్టానం చేస్తారు. ఆ కాలంలో వారు మధ్యాహ్నం వూరిలోనికి పోయి భిక్షను స్వీకరించి, సరస్వతీ దేవికి నమస్కరించి, ఆ భిక్షను భుజిస్తారు.

Basara Saraswati Temple Address:

శ్రీ ఙ్ఞాన సరస్వతీ దేవస్థానము,
గ్రామము & మండలము : బాసర్,
నిర్మల్ జిల్లా. పిన్ – 504101, తెలంగాణ,
కార్యనిర్వహణ అధికారి ఫోన్ నెంబర్ (Office(91) 08752 – 25550350
కార్యనిర్వహణ అధికారి ఫోన్ నెంబర 91 08752255550

Basara Saraswati Temple History in Telugu | Sevas, Timings

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top