Templesinindiainfo

Best Spiritual Website

Kailasha or Kailashanatha Temple Ajanta And Ellora Caves History in Telugu

Kailasha Temple History Telugu:

మన దేశంలో ఎన్నో పురాతన శివాలయాలు ఉన్నాయి అయితే ఈ శివాలయం ప్రత్యేకత ఏంటంటే ఇటుకలు రాళ్లు వంటివి పేర్చి కట్టిన ఆలయం కాదు ఏకంగా ఒక కొండని అలానే పై నుండి క్రిందకు తొలుచుకుంటూ ఈ అద్భుత ఆలయ నిర్మాణం జరిగింది. ఒకే కొండ రాయిని ఆలయం నిర్మించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తే అతి పురాతన ఈ శివాలయాన్ని ఎవరు నిర్మించారు అన్నది ఇప్పటికీ ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. మరి ఈ శివాలయం ఎక్కడ ఉంది. ఈ అద్భుత నిర్మాణం గురించి కొన్ని ఆశ్చర్యకర విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మహారాష్ట్ర ఔరంగాబాద్ సుమారు 26 కిలోమీటర్ల దూరంలో వేరూల్ అనే గ్రామంలో ఎల్లోరా అనే గృహాలు ఉన్నాయి. ఇక్కడ పర్వత శిఖరం పైన మలచబడిన మొత్తం 34 గృహాలు ఉన్నాయి. అందులో కైలాసనాధ ఆలయం అని పిలువబడే ఒక గృహ ఉంది. అయితే ఒక ఎత్తయిన ఒక కొండని తొలచి ఈ ఆలయాన్ని చెక్కడంలో చూపించడం నేర్పరితనం బహుశా ప్రపంచంలో మరి ఎక్కడ కూడా కనిపించదు.

సుమారు 8వ శతాబ్దంలో నిర్మించబడ్డ ఈ కైలాసనాధ ఆలయం, ఏకశిలా నిర్మాణాలను అయితే క్రీస్తుశకం 768 ఇది ప్రాంతంలో మహారాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలించిన ఒకటవ కృష్ణరాజు ఈ ఆలయాన్ని నిర్మించాడని తెలుస్తుంది. అయితే ఇటుకలతో రాళ్ళని పేర్చి కట్టడం వంటి నిర్మాణం కాకుండా ఎత్తయిన ఒక కొండని మొదట పైభాగం నుండి క్రిందకు తొలుచుకుంటూ వచ్చారు. అయితే ఇలా సుమారు మొత్తం నాలుగు లక్షల టన్నుల రాతిని తొలి స్తే ఈ ఆకయానికి ఒక ఆకారం వచ్చింది. అయితే అంత పెద్ద మొత్తంలో రాయిని చెక్కి ఒక రూపు తీసుకు రావాలంటే. అప్పటి రోజులను బట్టి కనీసం రెండువందల సంవత్సరాలు పడుతుంది కానీ కేవలం 18 సంవత్సరాల్లోనే ఈ ఆలయాన్ని తొలచి అప్పట్లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ వాడినా కూడా గంటకి 5 టన్నుల రాయిని పేకీలించడం అసాధ్యం కానీ ఆ కాలంలో ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించకుండా అంత తక్కువ సమయంలో కట్టారు అనేది ఆచార్యని కలిగించే విషయం అసలు ఇలా ఒక కొండను తోలిచి ఇలాంటి ఆలయం నిర్మించడం మనుషులకి సాధ్యమేనా అని అనిపిస్తుంది. అయితే ఆకాశం నుంచి చూస్తే ఈ టెంపుల్ ఎక్స్ ఆకారం ఉంటుంది. భూమి మీద నుండి చూస్తే 4 సింహాలు ఆకారంలో నిలుచున్నట్లు కనిపిస్తుంది.

ఇలా ఇప్పటి రోజుల్లో అయితే ఉన్న టెక్నాలజీ ఉపయోగించుకుంటే సాధ్యం అయ్యే అవకాశం ఉండొచ్చు.
కానీ ఆ కాలంలోనే ఇంతటి టెక్నోలజీ ఎలా సాధ్యమయింది. అసలు ఈ ఆలయ నిర్మాణం ఎవరు చేశారనే దానికి ఇప్పటికీ సమాధానం అనేది లేదు.

Ajanta And Ellora Caves

Kailashanatha Temple Hours:

All Days: 9.00 AM to 5.00 PM
Tuesday Closed

Kailasha Temple Address:

Ellora, Aurangabad, Maharashtra – 431102.

Kailasha or Kailashanatha Temple Ajanta And Ellora Caves History in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top