Ramadasu Keertanas

Rama Daivashikhamani Lyrics in Telugu | Ramadasu Keerthana

Rama Daivashikhamani Telugu Lyrics:

పల్లవి:
రామా దైవశిఖామణి సురరాజ మనోజ్జ్వల భూమణి రా ॥

అను పల్లవి:
తామరసాక్ష సుధీమణీ భవ్యతారక భక్త చింతామణి రా ॥

చరణము(లు):
నాడే మిమ్ము వేడుకొంటిగా శరణాగత బిరుదని వింటిగా
వేడుక మిము బొడగంటిగా నన్ను దిగనాడ వద్దంటిగా రా ॥

చింతసేయగ నేమిలేదుగా ముందుజేసిన గతి తప్పబోదుగా
ఇంతకు మిక్కిలి రాదుగా నే నితరుల కొలిచేది లేదుగా రా ॥

తమ్ముడు నీవొక జంటను రామదాసుని రక్షించుటను
సమ్మతినుండు మా యింటను భద్రాచలవాస నీ బంటును రా ॥

Add Comment

Click here to post a comment