Templesinindiainfo

Best Spiritual Website

Sri Ramula Divya Nama Lyrics in Telugu | Ramadasu Keerthana

Sriramula Divya Nama Smarana Telugu Lyrics:

పల్లవి:
శ్రీరాముల దివ్యనామస్మరణ చేయుచున్న
ఘోరమైన తపములను కోరనేటికే మనసా శ్రీ ॥

అను పల్లవి:
తారక శ్రీరామనామ ధ్యానముచేసిన చాలు
వేరువేరు దైవములను వెదుకనేటికే మనసా శ్రీ ॥

చరణము(లు):
భాగవతుల పాదజలము పైన చల్లుకొన్న చాలు
భాగీరథికి పొయ్యేననే భ్రాంతి యేటికే మనసా
భాగవతుల వాగమృతము పానము చేసిన చాలు
బాగు మీరినట్టి యమృతపానమేటికే మనసా శ్రీ ॥

పరుల హింస సేయకున్న పరమధర్మమంతే చాలు
పరులను రక్షింతునని పల్కనేటికే మనసా
దొరకొని పరుల ధనముల దోచకయుండితె చాలు
గుఱుతుగాను గోపురము గట్టనేటికే మనసా శ్రీ ॥

పరగ దీనజనులయందు పక్షముంచినదే చాలు
పరమాత్మునియందు ప్రీతి బెట్టనేల మనసా
హరిదాసులకు పూజలాచరించిన చాలు
హరిని పూజచేతుననే అహమదేటికే మనసా శ్రీ ॥

జపతపానుష్ఠానములు సలిపిరి మూఢులకై బుధులు
జగదీశుని దివ్యనామచింతన కోసరమై మనసా
చపలము లేకేవేళ చింతించే మహాత్ములకు
జపతపానుష్ఠానములు సేయనేటికే మనసా శ్రీ ॥

అతిథి వచ్చి ఆకలన్న యన్నమింత నిడిన చాలు
క్రతువుసేయవలెననే కాంక్షయేటికే మనసా
సతతము మా భద్రగిరిస్వామి రామదాసుడైన
నితర మతములని యేటి వెతలవేటికే మనసా శ్రీ ॥

Sri Ramula Divya Nama Lyrics in Telugu | Ramadasu Keerthana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top