Templesinindiainfo

Best Spiritual Website

Srimadakhilanda Koti Lyrics in Telugu | Ramadasu Keerthana

Srimadakhilanda Koti Telugu Lyrics:

శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండభాండ తండోపతండ కరండ మండల శాంతోద్దీపిత సగుణనిర్గుణాతీత సచ్చిదానంద పరాత్పర తారకబ్రహ్మాహ్వయ దశదిశాప్రకాశం – సకల చరాచరాధీశం; కమలసంభవ శచీధవ ప్రముఖ నిఖిల బృందారకబృంద వంద్యమాన సందీప్త దివ్యచరణారవిందం – శ్రీముకుందం;

తుష్టనిగ్రహ శిష్టపరిపాలనోత్కట కపటనాటకసూత్ర చరిత్రాంచిత బహువిధావతారం – శ్రీరఘువీరం;

కౌసల్యాదశరథ మనోరథామందానంద కందళిత నిరూఢ క్రీడావిలోలన శైశవం – శ్రీ కేశవం;

విశ్వామిత్ర యజ్ఞవిఘ్నకారణోత్కట తాటకా సుబాహు బాహుబల విదళన బాణ ప్రవీణ కోపపరాయణం – శ్రీమన్నారాయణం;

నిజపాదజల రజఃకణస్పర్శనీయ శిలారూప శాపవిముక్త గౌతమసతీవినుత మహీధవం – శ్రీమాధవం;

ఖండేందుధర ప్రచండకోదండ ఖండనోద్దండ దోర్దండ కౌశికలోచనోత్సవ జనకచక్రేశ్వర సమర్పిత సీతావివాహోత్సవానందం – శ్రీగోవిందం;

పరశురామభుజాఖర్వగర్వ నిర్వాపణతానుగత రణవిజయ వర్ధిష్ణుం – శ్రీవిష్ణుం;

పితృవాక్య పరిపాలనోత్కట జటావల్కలోపేత సీతాలక్ష్మణసహిత మహిత రాజ్యాభిమత దృఢవ్రత కలిత ప్రయాణరంగద్గంగావతరణ సాధనం – శ్రీమధుసూదనం;

భారద్వాజోపచార నివారిత శ్రమక్రమ నిరాఘాత చిత్రకూట ప్రవేశక్రమం – శ్రీత్రివిక్రమం;

జనకవియోగశోకాకులిత భరత శత్రుఘ్న లాలనానుకూల బన్ధుపాదుకాప్రదాన సుధానిర్మితాంతఃకరణ దుష్టచేష్టాయమాన క్రూరకాకాసుర గర్వోపశమనం – శ్రీవామనం;

దండకాగమన నిరోధక్రోధ విరాధానలజ్వాలానిర్వాపణ జలధరం – శ్రీధరం;

శరభంగ సుతీక్ష్ణాత్రిదర్శనాశీర్వాద నిర్వ్యాజకుంభసంభవ కృపాలబ్ధ మహాదివ్యాస్త్ర సముదయార్చిత ప్రకాశం – శ్రీహృషీకేశం;

పంచవటితటీసంఘటిత విశాలపర్ణశాలాగత శూర్పణఖా నాసికాచ్ఛేదనావమానావబోధన మహాహవారంభణ విజృంభణ రావణ నియోగ మాయామృగసంహార కార్యార్థలాభం – శ్రీపద్మనాభం;

రాత్రిచరవరవంచనాపహృత సీతాన్వేషణపథ పంక్తిరథక్షోభశిథిలీకృత పక్షజటాయుమోక్ష బంధుప్రియావసాన నిర్బంధన కబంధవక్త్రోదర శరీర నిరోదరం – శ్రీదామోదరం;

శబర్యుపదేశ పంపాతట హనుమత్సుగ్రీవ సంభాషిత బంధురోద్బంధుర దుందుభి కళేబరోత్పతన సప్తసాలచ్ఛేదన వాలివిదారణ ప్రసన్న సుగ్రీవసామ్రాజ్యసుఖ మర్షణం – శ్రీసంకర్షణం;

సుగ్రీవాంగద నీలజాంబవత్పనస కేసరి ప్రముఖ నిఖిల కపినాయక సేవా సముదయార్చిత దేవం – శ్రీవాసుదేవం;

నిజదత్తముద్రికా జాగ్రత్సమగ్రాంజనేయ వినయవచన రచనాంబుధిలంఘనోల్లంఘిత లంఖిణీ ప్రాణోల్లంఘన జనకజాదర్శనాక్షకుమారమారణ లంకాపురీదహన తత్ప్రతిష్ఠిత సుఖప్రసంగ ధృష్టద్యుమ్నం – శ్రీప్రద్యుమ్నం;

అగ్రజోదగ్ర మహోగ్రనిగ్రహ పలాయమానావమాననీయ నిజశరణ్యాగణ్య పుణ్యానునయ విభీషణాభయ ప్రదానానిరుద్ధం – శ్రీమదనిరుద్ధం;

అపారలవణపారావార సముజ్జృంభితోత్కరణగర్వనిర్వాపణ దీక్షాసమర్థసేతునిర్మాణ ప్రవీణాఖిల తరుచరోత్తమం – శ్రీపురుషోత్తమం;

నిస్తుల ప్రహస్త కుంభకర్ణేంద్రజిత్కుంభనికుంభాగ్నివరాతికాయ మహోదర మహాపార్శ్వాది దనుజతను ఖండనాయమాన కోదండగుణ శ్రవణశోషణ హతశేష రాక్షస వ్రజం – శ్రీఅధోక్షజం;

అకుంఠిత రణోపకంఠ సముత్కంఠ దనుజ కంఠీరవ కంఠ లుంఠనాయమాన జయసమారంహం – శ్రీనారసింహం;

దశగ్రీవానుజ పట్టభద్రత్వాశక్యవిభవ లంకాపురీస్ఫురణ సకలసామ్రాజ్య సుఖాచ్యుతం – శ్రీమదచ్యుతం;

సకలసురాసురాద్భుత ప్రజ్వలిత పావకముఖ పూతాయమాన సీతాలక్ష్మణానుగత మహనీయ పుష్పకాధిరోహణ నందిగ్రామస్థిత భ్రాతృభిర్యుత జటావల్కలవిసర్జనాంబర భూషణాలంకృత శ్రేయోవివర్ధనం – శ్రీజనార్దనం;

అయోధ్యానగర పట్టాభిషేక విశేషమహోత్సవ నిరంతర దిగంత విశ్రాంత హారహీరకర్పూర పయఃపారావారాపారద వాణీ కుందేందు మందాకినీ చందన సురధేను శరదంబుదాళీ దరదంభోళి శతధారాధావళ్య శుభకీర్తి చ్ఛటాంతర పాండురీభూత సభావిభ్రాజమాన నిఖిల భువనైక యశస్సంద్రం – శ్రీమదుపేంద్రం;

భక్తజనతా సంరక్షణ దీక్షాకటాక్ష విజృంభమాణ శుభోదయ సముజ్ఝరిం – శ్రీహరిం;

కేశవాది చతుర్వింశతి నామగర్భ సందర్భిత నిజకథాంగీకృత మేధావర్ధిష్ణుం – శ్రీవిష్ణుం

సర్వసుపర్వ పార్వతీహృదయకమల తారకబ్రహ్మనామం సంపూర్ణ కామం – రామం

భవతరణానుగుణసాంద్రం భవజనితభయోచ్ఛేద చ్ఛిద్రమచ్ఛిద్రం, భక్తజనమనోరథోన్నిద్రం శ్రీమద్భద్రాచల రామభద్రం రామదాస సుప్రసన్నం భజేఽహం భజేఽహం భజేఽహం భజేఽహమ్‌॥

Srimadakhilanda Koti Lyrics in Telugu | Ramadasu Keerthana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Scroll to top