Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views : Ad Clicks : Ad Views :
Home / Information / Sri Kalahasti Temple History | Sri Gnana Prasunamba Devi | Rahu Ketu Pooja Details

Sri Kalahasti Temple History | Sri Gnana Prasunamba Devi | Rahu Ketu Pooja Details

1679 Views

Srikalahasti Temple History / శ్రీ కాళహస్తి దేవాలయ చరిత్ర:
క్రీ.శ. 2వ 3వ శతాబ్ధాలలో తమిళ దేశానికి చెందిన శైవ నయనార్లు అప్పర్, సుందర్, తిరుజ్ఞాన సంబందర్, మాణిక్య వాచకర్ మొదలైన వారు ఈ క్షేత్రాన్ని సందర్శించి దీని ప్రాముఖ్యన్ని గురించి భక్తితో గానం చేసియున్నారు. శ్రీ ఆదిశంకరచార్యులు ఈ క్షేత్ర సందర్శణాంతరం తన శివానంద లహరి లో భక్త కన్నప్ప ను ఉదహరించడమే గాక ఈ క్షేత్రం లో భువనేశ్వరి దేవి పీఠాన్ని స్పటిక లింగాన్ని ప్రతిష్టించారు. గిరిజన ప్రాంతంలో ఈ క్షేత్రం నిర్మింపబడి ఉండటం వలన క్రీ. శ. 5,6 శతాబ్దాల దాకా దీని పోషణ గూర్చి ఎవరూ తమ దృష్టిని కేంద్రీకరింపలేక పోయారు. కానీ దక్షిణ భారత దేశంలో పల్లవుల రాకతో అధ్బూతమైన శిల్ప కళాఉధ్యమం రాజకీయంగా, ప్రాంతీయంగా అభివృధి చెందింది. ఆ నాడు దేవాలయ నిర్మాణము త్వరగా పాడవకుండాఉండేందుకు కలప, రెల్లు, మట్టితో నిర్మింపబడేవి. భక్తి ఉధ్యమం ప్రారంభమయ్యే దాకా శ్రీకాళహస్తి క్షేత్రం స్థానికంగా పలుకుబడి కలిగియున్న ఆటవిక సాయకుల చే ఆదరింపబడుతూ ఉండేది.

శిల్పం ద్వారా శాలి శాసనాల ద్వారా లభ్యమైన ఆధారాలను బట్టి క్రీ.శ. 9 వ శతాబ్దంలో పల్లవ చోళ రాజులు ఈ క్షేత్రంలో దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. కుళోత్తుంగ చోళుడు ఈ దేవాలయ గోపురాన్ని నిర్మించినారు. ధూర్జటి రచించిన శ్రీ కాళహస్తి మహత్యము వలన వీర నరశింహ యాదవ రాయలు హైమ, గిరిజ గుహ భైరవ గుహ అనే గుదనాలను, గోపుర మంట పాదులను నాట్య మందిరాన్ని ఇటుకలతో నిర్మించినట్లు తరువాత క్రీ.శ.12 వ శతాబ్ధానికి వీర నరసింహ రాయలు గోపురాలు, ప్రాకారాలు నిర్మించి వుండటానికి చెప్పవచ్చు. దక్షిణ గోపురాన్ని 12వ శతాబ్ధం లో కులోత్తుంగ చోళుడు కట్టించారు. బిక్షాల గోపురం ను దేవదాసి బిచ్చాలు కట్టించిందని ఈ గోపుర నిర్మాణం యాదవ నరసింహ రాయలు కాలములో జరిగినట్లు చెప్పుదురు. పదహారు కాళ్ళ మండపం లోనే క్రీ.శ.1529 లో క్రీ.శే.కృష్ణదేవరాయల సోదరుడైన అచ్చుతరాయల పట్టాభిషేక మహోత్సవము జరిగినది. కీ.శే.16వ శతాబ్ధంలో శ్రీ కృష్ణ దేవరాయలు ఒక మండపాన్ని నిర్మింప చేశాడు. దానినే ‘రాయల మంటపం ‘ అంటారు. మరియు పెద్ద గాలి గోపురం నిర్మించినారు. గోల్కొండ రాజ్య మంత్రులైన అక్కన్న, మాదన్నలు తమ పేర్లతో ఇక్కడ శివలింగాలు ప్రతిష్టించారు .

ఈ దేవాలయ నిర్మాణ విస్తరణ కేవలం ఉత్తర, దక్షిణ,పశ్చిమ దిశల వైపు మాత్రమే సాగినది. కానీ పర్వతము అడ్డుగా వుండడము వల్ల తూర్పు వైపునకు సాగలేదు. పడమటి దిశ వైపు చూపు గలిగిన గర్భగుడి ఎటువంటి అలంకారాలు లేకుండా పల్లవుల నాటి శైలి పోలివుంది. దీనివల్ల ఈ దేవాలయము పల్లవుల కాలమునాటిదని తెలుస్తుంది. ఈశ్వరునిగర్భగుడికి ఈశాన్య దిక్కున నాలుగు మీటర్ల దూరములో అమ్మవారి గర్భగుడి నిర్మింపబడి వున్నది. ఈ సన్నిదిలో నెలకొన్న దేవిని జ్ఞానప్రసూనాంబ అని పిలుస్తారు. ఈశ్వరుని సన్నిది శిల్ప కళ వెలుపలి భాగం కనిపించే అద్భుత చిత్రములైన కూట పంజర శాల వరుసలు, తామరపు మొగ్గల చిత్రములు, స్థంబాల, మీద గల అందమైన రంగు వల్లులు పాండ్య, విజయ నగర రాజుల నాటివని తెలుపుతున్నాయి. కీ.శ. 18వ శతాబ్ధంలో తమిళనాడుకు చెందిన నాటుకోటి శెట్టియార్ లోపలి ప్రాకారంలో గల శివాలయం, దేవి ఆలయాలకు, మంటపాలకు నాలుగు వైపుల వసారాలు కట్టించి వాటి కొక రూపాన్ని ఏర్పరచినారు.

Importance / ప్రాశస్త్యము
1. శివానందైక నిలయము (కైలాస పర్వతము)
శివానందైక నిలయము అనే పర్వతము ఈ యొక్క శ్రీకాళహస్తి క్షేత్రము నందు కలదు. ఈ శివానందైక నిలయము కైలాస పర్వతము గల పంచశిఖరములలో ప్రశిద్ధమనే శిఖరము. బ్రహ్మదేవుడు సృష్టికార్యము చేయు శక్తిని కోరి శివుని ప్రార్ధించగ బ్రహ్మదేవునికి శివుడు ఈ శిఖరం నీవు ఓర్వలేని బరువుతో భూమి మీద ఎక్కడ జారవిడిచెదవో అదియే దక్షిణ కైలాసము గా ప్రసిద్ధి పొందును. ఆ క్షేత్రమున నీవు తపమాచరించిన, స్వర్ణాభిష్టములు పొందగలవని పరమశివుడు బ్రహ్మదేవునకు వరమొసంగెను. ఆనాడు బ్రహ్మ దేవునకు పరమశివుడు అనుగ్రహించిన పర్వత శిఖరమే నేడు శ్రీకాళహస్తీలోని శివానందైక (కైలాస పర్వతము ) నిలయముగా కొలువుధీరియున్నది. ఇందుకు చిహ్నంగానే ఈ యొక్క క్షేత్రము నందు బ్రహ్మదేవుని ఆలయము కూడా కలదు. ప్రస్తుతము దక్షిణ కైలాసములోని శివానందైక నిలయ పర్వత శిఖరమునే కన్నప్ప కొండగా పిలువబడుచున్నారు. కావున ఈ క్షేత్రమును సిద్ధ క్షేత్రమని ప్రసిద్ధి పొందినది

ప్రపంచ ముదయించిన మొదటి రోజుల్లో వాయు దేవుడి కర్పూర లింగాన్ని భక్తి శ్రద్దలతో పూజించి అనేక వేల సంవత్సరములు తపస్సు చేశాడని తెలియచున్నది. ఆయన తపస్సు కు సాక్షాత్కరించిన పరమేశ్వరుడు ‘వాయుదేవా ‘ నీవు చలనం గలవాడవయ్యును చలనం లేని భక్తితో నన్నింత కాలం ధ్యానించి చేసిన తపస్సుకు ఆనందించాను. భక్తుడవు కనుక నీకు కావలసిన వరాలు ఇవ్వడానికి వచ్చాను. నీకు కావలసిన వరాలు ఏమిటో కోరుకో యిస్తా అన్నాడు. అందుకు వాయు దేవుడు ‘స్వామి’ నేని ప్రపంచము నందు లేని తావంటూ లేకుండగను, పరమాత్మ చందంబున ప్రతి జీవి యందు నేను ప్రధానమై యుండు లాగునను, నీ ప్రతిరూపమైన ఈ కర్పూర లింగము నా పేరు పిలువబడునట్లు నాకు వరములను ప్రసాదింపు ‘అని దోసిలి పట్టాడు.

సాంబ శివుడు సంతోషించి ‘ఓయీ ! నీవు అభిలషించిన ఈ మూడు వరములను కోరదగినవే. నీ అభిమతము ననుసరించి నీవీ ప్రపంచమంతటను వ్యాపించి వుండువు. నీవు లేక జీవరాశి బ్రతుక జాలదు. నా యీ లింగము ఇక మీద నీ పేరున వాయు లింగమని ప్రఖ్యాతి గాంచి సమస్త సుర అసుర గరుడ గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధి సాధ్వి నరముని వరుల చేతను పూజాలందుకొని నని’ వరములిచ్చి అదృశ్య మయ్యెను. నాటి నుండి ఈ క్షేత్ర మందలి కర్పూర లింగం వాయు లింగమను పేరున సమస్త లోకాల వారిచే పూజ లందుకోoటుంది.

Sri Gnana Prasunamba Devi / శ్రీ జ్ఞానప్రసూనాంబ :
దక్షయజ్ణ సమయమున ద్రాక్షాయణి దేవి యాగాగ్ని యందు దగ్దమైన పిదప మరల హిమవంతుని పుత్రికగ గౌరీ దేవి గా జన్మించి, పరమశివుని కళ్యాణమాడ పూనెను. అందులకు గాను పరమేశ్వరుడు ఈ యొక్క శక్తిని నీవు తిరిగి పరిపూర్ణముగా పొందిన గాని వివాహమాడుటకు వీలుపడదని చేప్పెను. అందులకు పరమేశ్వరి తక్షణ కర్తవ్యము ఏమని పరమేశ్వరుని కోరగ అప్పుడు పరమేశ్వరుడు పరమేశ్వరికి (పంచాక్షరి) మంత్రోపదేశము ఉపదేశించెను. తదుపరి పరమేశ్వరి ఈ యొక్క క్షేత్రమునందు తన స్వహస్తము తో శ్రీచక్ర స్థాపన కావించుకొని అనుష్టించి తన శక్తిని తాను తిరిగి పొంది పరమేశ్వరుని కళ్యాణముచేసుకొని శ్రీచక్ర బిందు స్థాపనమున నిలచి తాను సాధించిన జ్ఞాన శక్తిని సమస్త జీవరాసులకు పంచి పెడుతూ వున్నది. కావున ఈ క్షేత్రము యందు జ్ఞానప్రసూనాంబికగ వ్యవహరించి పూజాలందుకొనబడుచున్నది. తనచే మంత్రోపదేశము పొందినటువంటి భరద్వాజ మహాముని (మహర్షి) మొదలు ఇప్పటి వరకు భరద్వాజ వంశీకులే ఈ క్షేత్రము యందు షడ్ కాల పూజలు నిర్వహించడం జరుగుచున్నది.

Suvarnamukhi River / సువర్ణముఖి నది : – ( దివ్య గంగా)
అగస్త్య మహా ముని తన శిష్య గణంబుతో దక్షిణ దిగ్భాగమునకు వచ్చి తపము చేయుచుండెను. అప్పుడు వారికి నీరు లభింపకుండుటచే బ్రహ్మను గూర్చి ఘోర తపమాచరిoచెను. బ్రహ్మ ప్రత్యక్షమై తపమునకు మెచ్చి వర ప్రసాదముగా ముని కోరిన విధముగా ఆకాశ గంగను నియోగించెను. గంగా దేవి సువర్ణముఖరీ స్రవంతి రూపమును అగస్త్య పర్వతములో అవతరించి శ్రీకాళహస్తి మీదుగా ఉత్తర వాహినియై తూర్పు సముద్రమున కలియుచున్నది. ఈనాడు నదిలో అనేక తీర్ధ రాజములు విలసితములై దక్షిణ కైలాసమునానుకొని ప్రవహించు చున్నది. సువర్ణముఖి ఈ క్షేత్రము న ఉత్తర వాహిని గా ప్రవహించుచున్నది. ఇది గంగా నదికి సమానమైనదిగా పురాణ ప్రసిద్ధినొంది యున్నది. గంగాధి నదులకు పన్నెండు సంవత్సరములకు ఒకమారు మాత్రమే పుష్కరములు వచ్చును. కానీ ఈ దక్షిణకైలాస క్షేత్రములోని సువర్ణముఖి నదికి మాఘమాసమున మఖా నక్షత్రముతో కూడిన పౌర్ణమి రోజున విశేషముగా పుష్కరము జరుగుచున్నది.

Daily Sevas / నిత్యోత్సవ సేవలు : ప్రధానంగా ఆరు
ఉదయం 5.30 గం!! మేలు కొలుపు సేవ
ఉదయం 6.00. గం!! ప్రథమ కాలాభిషేకం
ఉదయం 7.00)గం!! ద్వితీయ కాలాభిషేకం (తదుపరి నిత్యోత్సవ మూర్తి ఆలయ ప్రదక్షిణం – ఆరాధనం)
ఉదయం 10.00 గంటలకు ఉచ్చికాల అభిషేకం
సాయంత్రం 5.00 గంటలకు ప్రదోషకాల అభిషేకం
రాత్రి 9.00 గంటలకు పవళింపుసేవ
అభిషేకాలు ముందుగా అమ్మవారికి, తదుపరి వెంటనే స్వామి వారికి జరుపుతారు. అభిషేక జలాలను ఆలయ నైరుతి దిశలో సూర్య, చంద్ర పుష్కరిణునులనుండి సమకుర్చుతారు.. అభిషేక సమయములో దిక్షితులైన శివార్చకులు కూడా మహిమాన్వితమైన, స్వయంభు మూర్తిని స్పృశించరు.
నైవేద్య దీపరధనంలు ముందుగా స్వామికి తదుపరి వెంటనే అమ్మవారికి జరుపుతారు.
అభిషేకానంతరం జరిగే దీపారాధన సేవలు చూపరులను భక్తిభావం కలిగించి మంత్రముగ్దులను చేస్తుంది.
అమ్మవారికి అభిషేక ద్రవ్యాలు: గోక్షీరం, పంచామృతం, పసుపు, పన్నీరు.
స్వామివారికి అభిషేక ద్రవ్యాలు : గోక్షీరం, పంచామృతం పచ్చ కర్పూర జలం
ఈ పూజలు వైదికాగమ నిర్ణిత పంచ పూజలు గా నిర్వహిస్తారు.
భక్తులు సమర్పించే గోదది, తేనే, నారికేళ జలం, సుగంధ ద్రవ్యములు కూడా అభిషేక ద్రవ్యాలు గా స్వీకరిస్తారు.
గత 25 సం|| లకు పైబడి ప్రారంభింపబడిన ‘ నిత్యకల్యాణోత్సవం’ లో భట్లు లు కర్తలుగా తగు పైకం చెల్లించి భాగస్వాములవుతున్నారు.
‘ నిత్యాన్న దానం’ పథకంలో రూ. 1116/- చెల్లించిన వారిని శ్వాశ్వత చందాదారులుగా గుర్తించి సంవత్సరములో వారు కోరిన దినం రోజున 20 మందికి అన్నదానం చేస్తారు. నిర్ణయించిన పైకం చెల్లించి ఏ ఒక్క రోజైనా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు.
మంగళ, బుధ ,గురు, శుక్ర, వరములలో రాత్రి 9.00 గంటలకు మరియు శని, ఆది,సోమ వారములలో రాత్రి 9.30 గం. శ్రీ స్వామి, అమ్మవార్ల ఏకాంతసేవా మూర్తులను శయన మందిరానికి చేర్చి ఏకాంతసేవ జరుపుతారు. దీనినే పవళింపుసేవ, ఏకాంత సేవ అంటారు. వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తి వంటి కోర్కెలు సిద్ధింకిన భక్తులు తమ మొక్కులను చేతి గాజులు సరాలుగా, ఊయలలుగా సమర్పింస్తుంటారు. ఇది స్వామి వారి భక్త వాత్సల్యతకు ప్రత్యక్ష్యసాక్షి

Weekly Sevas / వారోత్సవాలు:
ప్రతి సోమవారం శివునికి చాలా ప్రీతికరం. ఈ దినం శ్రీ స్వామి, అమ్మ వార్లకు ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మ వారికి వెండి కిరీటము, పాదాలు, ఉడుపులు అలంకరిస్తుంటారు.
ప్రతి గురువారం ప్రత్యేకించి గురువు ఒక రాశి నుండి మరొక రాశి కి మరిన దినం ఆలయం లోని శ్రీ దక్షిణా మూర్తీ స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు, దీపారాధన సేవలు జరుపుతున్నారు.
ప్రతి శుక్రవారం అమ్మ వారికి స్వర్ణాభరణాలు, ఉడుపులు అలంకరిస్తున్నారు. సాయంకాలం అమ్మవారికి ‘ శుక్రవార ఉత్సవమూర్తి’ కి ఊయల సేవ, ఆలయ ప్రదక్షిణం, ప్రత్యేక దీపారాధన సేవలు చేస్తున్నారు.
ప్రతి శనివారం ప్రత్యేకించి శని త్రయోదశి తిథినాడు శ్రీ శనేశ్వర స్వామి వారికి ‘తిల తైలాభిషేకం’ వంటి ప్రత్యేక పూజలు జరుపుతున్నారు.
ప్రతి శనివారం ఈ ఆలయం అనుబంధముగా వున్న శ్రీ ప్ర్సన్న వరదరాజ స్వామి వారి ఆలయములో ప్రత్యేక అభిషేక పూజలు జరుపుతున్నారు.

Fortnight Sevas / పక్షోత్సవం:
ప్రతి నెల శుద్ధ త్రయోదశి, బహుళ త్రయోదశి తిథులయందు శ్రీ స్వామి, అమ్మ వార్లకు ప్రదోషకాల అభిషేకాలతో పాటు, ప్రదోష మూర్తులను ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు జరిపి ఆలయంలో ప్రదోష నంది సేవ, దీపారాధన సేవలు అత్యంత వైభవముగా చేస్తున్నారు.

Monthly Sevas / మాసోత్సవాలు:
ప్రతి మాసం లో 12 మాస నామాలకు అనుబంధమై ఉన్న నక్షత్రాలు కలయిక తీతులనాడు (చైత్రం – చిత్తా నక్షత్రం) సద్యోముక్తి ప్రదాతలైన శ్రీ స్వామి, అమ్మ వార్లకు ప్రత్యేక అభిషేక పూజలు జరుపుతున్నారు.
ప్రతి తెలుగు నెల శుద్ధ చవితి, బహుళ చవితి తిథులందు ఆలయంలోని వినాయక ప్రతిమలకు ప్రత్యేక పూజలు జరుపుతున్నారు.
ప్రతి షష్టి నాడు, కృత్తిక నక్షత్రం కలిసిన తిథినాడు ఆలయంలో శ్రీ వళ్ళి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి , మరియు పట్టణము లోని విజ్ఞానగిరి పై వెలసియున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేక పూజలు జరుపుతున్నారు.
ప్రతి అమావాస్య తిథి నాడు శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపి ఉత్సవ మూర్తులకు పట్టణ వీధులయందు అంబరీ ఉత్సావం జరుపుతారు.
ప్రతి పౌర్ణమి తిథి నాడు శ్రీ స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రాంగణములోని ప్రత్యేక మండపాలలో ఉంజల్ సేవ జరుపుతున్నారు.

Occasional Sevas / మాసానుక్రమంగా నిర్ణీత తిథులందు జరిగే పూజా కార్యక్రమాలు
ఛైత్ర శుద్ధ పాడ్యమి, నూతన సంవత్సరాది, ఉగాది సందర్భముగా ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఉగాది పచ్చడి పంచుతారు. పంచాంగ శ్రవణం, కవి సమ్మెళనం వంటి కార్యక్రమాలు జరుపుతున్నారు. శ్రీ స్వామి వారి ఉత్సవ మూర్తిని సర్వ భూపాలం, మహా మేరువు, కైలాస ప్రస్తారం, సింహాసనం అనే పేర్లు గల వాహనం పై అమ్మవారి ఉత్సవ మూర్తిని కామధేనువు వాహనం పై పట్టణ వీధుల్లో ఉత్సవం జరుపుతారు.
ఛైత్ర శుద్ధ పాడ్యమి నుండి 10 రోజులు పట్టణ ప్రాంతములో వెలసిన శ్రీ రామ మందిరాల్లో ‘శ్రీ రామ నవమి’ ఉత్సవాలు జరుపుతారు.
ఛైత్ర శుద్ద పంచమి నాడు శ్రీ స్వామి, అమ్మ వార్ల ఉత్సవ మూర్తులను ఉరందూరు గ్రామ శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి చేర్చి పూజలు జరుపుతారు.
చైత్ర శుద్ద నవమి నుంది పౌర్ణమి వరకు ‘ పెద్ద కొటాయి ఉత్సవాలు ‘ అనే వసంతోత్సవాలు జరుపుతారు. వైశాఖ శుద్ధ అష్టమి నుండి పౌర్ణమి వరకు ‘చిన్న కొటాయి ఉత్సవాలు’ అనే పొగడ మాను ఉత్సవాలు’ జరుపుతారు. ఈ సందర్బముగా శ్రీ స్వామి వారి ఉత్సవ మూర్తి సోమ స్కందమూర్తి, అమ్మ వారి విగ్రహాలకు ప్రత్యేక అభిషేక పూజలు జరుగుతాయి.
ఆషాడ మాసంలో అలయ అనుబంధమైన శ్రీ ద్రౌపతీ సామెత శ్రీ ధర్మరాజ స్వామి వర్లకు 10 రోజులు ‘ గ్రామ దేవత ఉత్సవాలు’ జరుగుతాయి. ముందుగా 30 రోజులు మహా భారత గ్రంధ పఠనం జరుగుతుంది. ఉత్సవ దినాలలో రాత్రులయందు ‘మహా భారతం’ ఘట్టాల నాటకం ప్రదర్శిస్తారు. దీనిలో అర్జున తపస్సు అగ్నిగుండ ప్రవేశం రోజులయందు మొక్కులు తీర్చుకొంటారు. వేలాది మంది భక్తులు దీక్షలు పూని ఉపవసలతో అగ్నిగుండ ప్రవేశం చేస్తారు.
శ్రావణ పౌర్ణమి కి ముందు వచ్చు శ్రావణ శుక్రవారం అమ్మవారి ఆలయంలో ‘శ్రీ వరక్ష్మి కలశ పూజ’ జరుగుతుంది.
శ్రావణ బహుళంలో ఆడికృత్తిక సందర్భంగా విజ్ఞాన గిరిపై వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 10 రోజుల ఉత్సవాలు జరుగుతాయి. పగలు రాత్రి వివిధ వాహన సేవల్తో పురవీధుల ఉత్సవాలు జరుగుతాయి.
అశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు ప్రధాన ఆలయంలో, కనకాచలం పై వెలసిన శ్రీ కనక దుర్గ ఆలయంలో శ్రీ వరదరాజ స్వామి వారి గ్రామ శక్తుల ఆలయాలలో, కన్యకా పరమేశ్వరి ఆలయాలలో ‘శరన్నవరాత్రి ఉత్సవాలు’ అత్యంత వైభవముగా జరుపుతారు.
వైశాకాఖ శుద్ధ దశమి నుండి బహులా పంచమి వరకు శ్రీ ప్రసన్న వరదరాజ స్వామి వారికి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవముగా జరుపుతారు.
మాఘ మాసం లో మఖ నక్షత్ర తిథినాడు తొండమనడు చక్రవర్తి దొంగల దోపు ఉత్సవం జరుగుతుంది.
సూర్య చంద్ర గ్రహణ కాలములో శ్రీ స్వామి , అమ్మ వర్లకు గ్రహణ శాంతికి ప్రత్యేక అభిషేక పూజలు, ఆలయ శుద్ధి జరుపుతారు.
సాలిన పవిత్రోత్సవాలు నిర్వహిస్తూ యాగ పూజలు దేవత మూర్తులకు పాటు పవిత్ర సమర్పణ మహదాశీర్వచనం పూర్ణాహుతి, ఆ రాత్రి అమ్మవారి ఆలయం ముందు ఊయల సేవ, పుర విధులయందు నంది, సింహవాహన సేవలు వైభవోపేతంగా జరుపుతారు.
వర్షాభావం ఏర్పడినప్పుడు శ్రీ భరద్వాజ తీర్థం వరుణ జపాలు, ఆలయంలో మృత్యుంజయ స్వామికి అభిషేక పూజలు జరిపి విస్తృతముగా వర్షాలు కురిసే ప్రయత్నాలు చేస్తారు. ఈ ప్రయత్న ఫలితంగా మిక్కుటంగా వర్షాలు కురవటము పరిపాటి.
శివానుగ్రహం పొందగోరే వారు ఒక సంవత్సరకాలం ఈ క్షేత్రనివాసులై సద్యోముక్తి వ్రతం చేస్తూ స్వామి వారి కృపకు పాత్రులవుతున్నారు.
గతంలో 1912, 1974, వ సం. మరియు 17-1-2000 నుండి 19-1-2000 వరకు ఈ ఆలయంలో మహా కుంభాభిషేకాలు నేత్ర పర్వముగా నిర్వహింఛారు. శివుని జన్మ నక్షత్రం ఆరుద్రలో మీనా లగ్నం లో ఈ ఉత్సవాలు జరిపారు. తొలి రోజు కలశ పూజలు, యాగారంభం జరుగుతుంది. రెండవరోజు యాగ పూజలు నిర్వహిస్తారు. మూడవరోజు మహా పూర్ణాహుతి – మహా కుంభాభిషేకం జరిపినారు. ఈ సందర్భముగా ప్రథమం గా శ్రీ భరద్వాజ మహర్షి మరియు శ్రీ- కాళ – హస్తి విగ్రహమూర్తుల అభిషేకం తదుపరి అనుజ్ఞ పూజ, యజ్ఞ బలి పూజలు జరిపారు. మహా కుంభాభిషేక స్థల నిర్ణయం జరుగుతుంది. యాగానికి అవసరమైన (మట్టి) మృత్ సంగ్రహణం, అంకురార్పణ జరుగుతాయీ. స్వామి వారి 36 కళలను కంభంలోకి ఆహ్వానించి కంభ స్థాపన జరుపుతారు. అష్టబంధనం కేస్తారు.
శ్రీ స్వామి వారికి, శ్రీ అమ్మ వారికి, నవగ్ని హోమ యజ్ఞశాలలో నిర్మిస్తారు.
శ్రీ వినాయక స్వామికి, శ్రీ అమ్మవారికి, నవాగ్ని హోమ౦ యజ్ఞశాలలో నిర్మిస్తారు.
శ్రీ వినాయక స్వామికి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి, శ్రీ దక్షిణామూర్తి వారికి పంచగ్ని యజ్ఞశాలలు నిర్మిస్తారు.
శ్రీ చక్రం ఉత్సవర్లకు, శ్రీ స్వామి స్థూపి (శిఖర కలశం), శ్రీ అమ్మవారి స్థూపి (శిఖర కలశం) ధ్వజ స్తంభనికి, శ్రీ శనేశ్వరస్వామికి, శ్రీ నటరాజ స్వామి కి, శ్రీ సహస్ర లింగేశ్వరస్వామి కి , శ్రీ చండికేశ్వర స్వామికి, సప్త మాతృకలకు శ్రీ అష్టోత్తర లింగమునకు, శ్రీ కుమార కాళహస్తీశ్వర స్వామికి, శ్రీ బాల జ్ఞాన ప్రసూనంబకు, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి కి శ్రీ అన్నపూర్ణ దేవికి, శ్రీ గోపుర సుబ్రహ్మణ్య స్వామి వార్లకు ఏకాగ్ని యాగశాలలు ఏర్పాటు చేశారు.
శ్రీ సూర్యనారాయణ స్వామి, స్వయం భూ నంది , శ్రీ భక్త కన్నప్ప, శ్రీ కాల భైరవ స్వామి, శ్రీ మృత్యుంజయ స్వామి, నయనార్లకు స్థoడలం యగశాలలు ఏర్పాటుచేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
బ్రాహ్మణ పూజ, గో పూజ, వంటి పూజలు నిర్వహిస్తారు. అత్యంత ప్రధానమైన అలయ పై భాగంలోని పంచ మూర్తూ గోపుర శిఖరాలకు శాస్త్రోక్తముగా పూజలు నిర్వహించి యాగ కలశ జలాలతో అభిషేక సంప్రోక్షణ కార్యక్రమాలు చూపరులకు జన్మ ధన్యత కలిగే విధముగా నేత్రపర్వంగా నిర్వహిస్తారు.
హారతి అష్టోత్తర అర్చన, సహస్రనామార్చన, త్రిశతి, నిత్య దిట్టం, క్షీరాభిషేకం, పంచామృతాభిషేక౦, రుద్రాభిషేకం, నిత్య కళ్యాణం, నిత్యన్నదానం, తలనీలాల సమర్పణ, ప్రదిశ అభిషేక సేవలు, శనేశ్వర అభిషేకం, శుక్రవారం అమ్మవారి ఉంజల్ సేవా, పౌర్ణమి ఉంజల్ సేవా, నంది, సింహవాహన సేవలు, రాహు కేతు గ్రహది సర్పదోష నివారణ వంటి ఎన్నో పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Sri Kalahasti TempleTemple Back EntranceKarthika Masa / కార్తీక మాసం:
కార్తిక మాసంలో శివునికి అత్యంత ప్రీతికరం. ప్రతి రోజు మహా పవిత్రమైనదే! కార్తిక సోమవారాలు, ప్రత్యేకించి శ్రవణ నక్షత్ర తిథినాడు ‘కోటిసోమవార వ్రత’ సందర్భముగా శివ కేశవ అభేదంగాప్రత్యేక పూజలు జరుపుతారు.
కార్తీక శుద్ధ నాగుల చవితి నాడు పట్టణమంతా ఉపవాసాలతో పాములు పుట్టల వద్ద నాగదేవతారాధనలు జరుపుతారు.
కార్తీక పౌర్ణమి, కార్తీక దీపోత్సవం, జ్వాల తోరణం సందర్భముగా ఆలయంలో శివాలయంలో భరణి ప్రమిదలతో లింగాకృతితో దీపాలు ఏర్పాటుచేసి, విశేష పూజలతో ఆలయం వెలుపల చుక్కాణి వెలిగించి వేడుకలు జరుపుతారు.
కార్తీక అమావాస్యకు ముందు గ్రామ శక్తులు నలగంగమ్మ, ముత్యాలమ్మ, అంకమ్మ, భువనేశ్వరి, కావమ్మ, అంకాళ పరమేశ్వరి దేవేరులకు ఒకే రోజు ఏడు గంగాల జాతర అత్యంత వైభవముగా జరుపుతారు. ఇది శ్రీకాళహస్తి కి ఒక ప్రత్యేకత.
కార్తీక బహుళ దశమి నుండి అమావాస్య వరకు శ్రీ స్వామి, అమ్మ వర్లకు లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చనలు జరుపుతున్నారు. పట్టణ మాడ వీధులయందు ఉత్సవం జరుపుతారు.
మార్గశిర మాసం పాడ్యమి నుండి మకర సంక్రమణం సంక్రాంతి వరకు 30 రోజులు ఆలయంలో ఉష; కల అభిషేక పూజలు జరుపుతారు. శుక్రవార అమ్మణ్ణి ఉత్సవ విగ్రహ మూర్తిని ప్రతి ఉదయం ‘మనోన్మని’ అను గొబ్బిలక్ష్మి గా పుర వీధి ఉత్సవం జరుపుతారు.
మార్గశిర మాసం వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను వెండి, శేష వాహనం, వెండి యాళి వాహనం పై ఊరేగిపు ఉత్సవం కూడా జరుగుతుంది.
మార్గశిర మాసం శ్రీ స్వామి వారి జన్మ నక్షత్రం, శ్రీ స్వామి వారి శుభ నక్షత్రం అయిన ఆరుద్ర నక్షత్రం తిథి నాడు శ్రీ నటరాజ స్వామి వారి ముందు తండుల పిష్టంతో (బియ్యపు పిండి) లింగకృతిని ని చేసి నేటి అభిషేక పూజలు జరుపుతారు.
శ్రీ స్వామి అమ్మ వార్ల కు వేడి నీటి అభిషేకం చేయిస్తారు. దీనిని ‘ ఆరుద్ర అభిషేకం’ అంటారు. నక్షత్ర శాంతికి ఆరాత్రి ఆలయ ప్రాంగణంలో వెలుపల ఫ్రాకార నంది వెనుక గల అగ్నిగుండంలో నేటి కుండల ఆహుతి చేస్తారు. దీనిని ‘అరికట్ల ఉత్సవం’ అంతరు.
మార్గశిర బహుళ అష్టమి నాడు శ్రీ కాలభైరవాష్టమి సందర్భముగా శ్రీ కాళభైరవ స్వామికి ప్రత్యేక పూజలు జరుపుతారు.
మకర సంక్రాంతి నాడు ‘ప్రదోష ఉత్సవ మూర్తి’ కైలాసగిరి ప్రదక్షిణంతో పుణ్యవచనం, మార్గ శుద్ధి జరుగుతుంది.
కనుమ పండుగ నాడు ఉత్సవమూర్తులు, శ్రీ సోమస్కందమూర్తి, అమ్మవార్లు కైలాసగిరి ప్రదక్షిణ చేసి భక్తులను, తాపసులను మహా శివరాత్రి ఉత్సవాలకు ఆహ్వానిస్తారని ఒక జన బహుళయ నమ్మకం ఉరందూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారు ఉత్సవ మూర్తిని కూడా ఐ గిరి ప్రదక్షిణం కేస్తారు. వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షీణలో పాల్గొంటారు. సాయంకాలం భక్తులు ఎదురు సేవలో పాల్గొంటారు. ఈ సందర్భముగా శ్రీ స్వామి అమ్మవారల్ ‘గాలి గోపుర ప్రవేశ దర్శనం, ‘కోటి జన్మల పాప విమోచనకరం’ గా ప్రశస్తమైనది. తదుపరి పట్టణ మాడవీధుల ఉత్సవం జరుపుతారు.
మాఘ అమావాస్య తిథినాడు శ్రీ స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను శ్రీ భరద్వాజ తీర్థనికి (లోబావికి) చేర్కి ప్రత్యేక అభిషేక పూజలు చేస్తారు.
మాఘ శుద్ధలో ‘రథసప్తమి’ సందర్భముగా ఆలయంలో విశేష పూజలు అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సూర్య ప్రభ, యాళి వాహనాలపై పుర వీధుల ఉత్సవం జరుపుతారు.
మాఘ శుద్ధ ఏకాదశి ‘ భీష్మ ఏకాదశి’ సందర్భముగా శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీ వళ్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులను విజ్ఞానగిరి క్రింద గల మండపానికి చేర్చి ప్రత్యేక పూజలు జరుపుతారు.
మాఘ పౌర్ణమి ‘వ్యాస పౌర్ణమి’ సందర్భముగా పంచమూర్తులను,(1. శ్రీ సోమస్కందమూర్తి 2. శ్రీ అమ్మవారు 3. శ్రీ వినాయక స్వామి 4. శ్రీ వళ్ళీ దేవసేన సమేత శ్రీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 5. చండికేశ్వర స్వామి ) స్వర్ణముఖి నది తీరానికి చేర్చుతారు. పల్లకిలో స్వామి వారి త్రిశూలం తెచ్చి, వేద పండితులచేత సద్యోముక్తి వ్రత విధానాన్ని, ప్రాముఖ్యతను చక్కగా వివరింపజేస్తారు. ‘త్రిశూలం’ చేత చక్ర స్నానం చేయిస్తారు. వేలాది భక్తులు కూడా చక్రస్నానం చేస్తారు. దీనిని ‘స్వర్ణముఖీ పుష్కరదినం గా అభివర్ణిస్తారు. ఈ నదీ స్నానం శ్రమకు తగ్గ ఫలితం ఇస్తుందని ప్రగాడ నమ్మకం. ప్రత్యేక పూజలు తదుపరి పట్టణ వీధులయందు పంచ మూర్తులతో నంది, సింహ వాహనాల సేవ జరుగుతుంది.

Sri Kalahasti Rahu Ketu Pooja Timings and Location:

S.No Sri Kalahasti Arjitha Sevas Ticket Price Pooja Place Timings
1 Suprabhata Seva Rs. 50/-
2 Gomatha Pooja Rs. 50/-
3 Archana Rs. 25/-
4 Sahasranamarchana Rs. 200/-
5 Thrisathi Archana Rs. 125/-
6 Rahu Ketu Pooja Rs. 300/- Sri Krishna Devaraya Mandapam 6.00 am – 6.00 pm
7 Special Kala Sarpa Nivarana Pooja Rs. 750/- Gnanambika Mandapam 6.00 am – 6.00 pm
8 Aseervachana Rahu Ketu Kala Sarpa Nivarana Pooja Rs. 1500/- Outside temple near Dwajasthambham (Addala Mantap) 6.00 am – 6.00 pm
9 Special Aseervachana Rahu Ketu Kala Sarpa Nivarana Pooja Rs. 2500/- Inside temple. Near to Kalyanotsavam Mantap 6.00 am – 6.00pm

For Better Pooja prospects, Rahu Ketu Pooja to be performed during Rahu Kalam Timings:

S.No Day Best Time for Rahu Ketu Pooja Timings at Sri Kalahasti Temple
1 Sunday  4:30 p.m To 6.00 pm
2 Monday 7:30 a.m To 9.00 a.m
3 Tuesday 3.00 p.m To 4:30 p.m
4 Wednesday 12:00 p.m To 1:30 p.m
5 Thursday 1:30 p.m To 3.00 p.m
6 Friday 10:30 a.m To 12.00 Noon
7 Saturday 9:00 a.m To 10:30 a.m

Sri Kalahasti Temple Timings: 5.30 am to 8.30 pm.

Sri Kalahasti Temple Rahu Ketu Pooja Ticket Price: Rs.300, Rs.750, Rs. 1500, Rs. 2500

Festivals Celebrated:
Mahashivaraatri
Aadikruthika
Varadaraja Swamy vari Brahmotsavams
Dharmaraja Swamy vari Utsavams
Vijayadasami / Dasara Utsavams
Kedaari Gowri Vratham
Edu Gangammala Jaatara

Address:
Srikalahasti Swamyvari Devasthanams,
Srikalahasti,
Chittoor – 517 644.
Phone: 08578 – 222 240.

  • Facebook
  • Twitter
  • Google+
  • Pinterest
 
Note: We will give astrological reading / solution for those who are longing for children and do not give predictions for Job, etc.

3 Comments

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *